Skip to main content

Namaste NRI

వారి నమ్మకం ఈ రోజు నిజమైంది : రాజమౌళి

దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఆకాశంలో ఒక తార. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతిహాసన్‌, రుహానీశర్మ కీలక పాత్రధారులు. పవన్‌ సాదినేని దర్శకుడు. అల్లు అరవింద్‌, స్వప్నదత్‌, సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడారు. కల కనడం ఒక ఎత్తయితే.. దాన్ని సాకారం చేసుకోవడం ఒక ఎత్తు. సాకారం చేసుకున్న కలతో ఇంతటి విజయాన్ని సాధించడం మరో ఎత్తు. ఈ కలను ఈ టీమ్‌ చాలా ఏళ్లు మోశారు. వారి నమ్మకం ఈ రోజు నిజమైంది. అందుకే వారందరికీ నా అభినందనలు. ఈ కథ కనెక్టవ్వడానికి కథనం ప్రధాన పాత్ర పోషించింది. చాలా సన్నివేశాలు మనసును తాకాయి. డైలాగులు కూడా చాలా బావున్నాయి. యాక్టర్స్‌ అందరూ అద్భుతంగా నటించారు. కల్పన పాత్రనే కాదు, సినిమాను కూడా భుజాలపై మోశాడు దుల్కర్‌ సల్మాన్‌. ఇంత మంచి సినిమాకు ఈ స్థాయిలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. చూడని వాళ్లుంటే త్వరగా చూడండి అని అన్నారు.

చిత్రకథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ఇది నాకు ఎమోషనల్‌ జర్నీ. తెలుగు ఇండస్ట్రీలో నేనూ భాగం అయినందుకు ఆనందంగా ఉంది. బెస్ట్‌ రైటర్స్‌, బెస్ట్‌ డైరెక్టర్స్‌ దొరకడం వల్లే ఇక్కడ సక్సెస్‌ కాగలిగాను. పవన్‌ సాదినేని వెరీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. క్లారిటీతో మనసుపెట్టి సినిమా తీశాడు. నాకు అద్భుతమైన సినిమా ఇచ్చాడు. టీమ్‌గా కాదు, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్‌గా ఈ సినిమాకు పని చేశాం. అందుకే ఈ విజయం. విజయానికి కారణమైన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ నిర్మాతలు మైత్రీ రవి, సుప్రియ, కార్తికేయ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events