Skip to main content

Namaste NRI

డీలిమిటేషన్ బిల్లుకు జై కొట్టిన కేటీఆర్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ పార్టీకి ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఏకంగా 17 నుంచి 26కు పెరుగుతుందని ఆయన తెలిపారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పించాలని, సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన తమ ఆందోళనను పరిష్కరిస్తోందని, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండకూడదని ఆయన వివరించారు.

అంతేకాకుండా, మహిళా రిజర్వేషన్లకు తాము ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చామని, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. బీజేపీ ప్రతిష్టాత్మక బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయం మరోసారి రుజువైందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events