రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ దేశంలో శక్తిమంతమైన జంట (పవర్ కపుల్) గా మొదటి స్థానంలో నిలిచారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ ఈ సర్వే నిర్వహించింది. అంబానీ జంటకు 94 శాతం స్కోరు లభించింది. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట 86 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 79 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. షారుఖ్`గౌరీ ఖాన్, అమితబ్ జయాబచ్చన్, నారాయణమూర్తి, సుధా తదితర జంటలు తొలి 10 స్థానాల్లో నిలిచారు. నూతన వధూవరులు విక్కీ, కత్రినాలు తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం.