బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్‌తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన, ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు ప్రభాస్. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా రెబల్ స్టార్ నిలిచారు. నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ఆయన ఎంపికయ్యారు. యునైటెడ్ కింగ్‌డమ్ ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు. రెండో స్థానంలో బ్రిటిష్, పాక్ నటుడు రిజ్ అహ్మద్ నిలువగా మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, నాలుగు స్థానంలో ఇండియన్ అమెరికన్ మిండీ కలింగ్, ఐదోస్థానంలో గాయని శ్రేయా ఘోషల్ నిలిచారు.