టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం. తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు వెల్లడిరచారు. నేను ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. పూర్తిస్థాయిలో ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజంగానే ఉద్యోగానికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? అన్న విషయంపై అతని ఫాలోవర్లలో గందరగోళం నెలకొంది. మస్క్ తరచూ సోషల్ మీడియాను ప్రచారం కోసం, వదంతుల వ్యాప్తికి వాడుకొంటారు. జవనరిలో జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో మాత్రం మరికొన్ని సంవత్సరాలు టెస్లా సీఈవోగా కొనసాగుతానని ఆశిస్తున్నట్లు మస్క్ పేర్కొనడం గమనార్హం. ఎలన్ మస్క్ నిజంగానే తాను నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అలాగని జోక్ చేశాడని చెప్పడాలికి వీల్లేదు. ఎందుకంటే మస్క్ చెప్పిందే చేసిన దాఖలాలు ఎక్కువ కాబట్టి. పైగా ట్విటర్ వేదికగా గతంలో ఆయన చెప్పినవెన్నో చేశాడు కూడా.