సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితాల నుంచి సింగపూర్‌ని తొలగించింది. అదే సమయంలో కొత్తగా ఘనా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో చేర్చింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభనతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒమిక్రాన్ ప్రభావం నుంచచి దేశాల జాబితాను అట్ రిస్ పేరుతో కేంద్రం ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజీల్యాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయిల్, హాంక్‌కాంగ్ దేశాలు ఉన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)