పాన్ ఇండియా స్థాయిలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌ను సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన పాన్ ఇండియా చిత్రం పుష్పను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమాకుర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమా తనకెంతో బాగా నచ్చిందని అన్నారు. అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల ఆనందంగా వుంది. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని ప్రశంసించారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ప్రేములో కనిపించిదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)