దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నివారణ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాల్సిందేనని ఆదేశాలిచ్చింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం కూడా నిషేధించింది. ఈ ఆంక్షలను 2022 జనవరి 31వ తేదీ వరకు అమలు చేయాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది. అవసరమైతే కేసుల పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధింవచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)