యూఏఈలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. దుబాయ్‌లో సివిల్ చట్టాలని అనుసరించి వివాహం చేసుకున్న ఓ కెనడా జంటకు అక్కడి ప్రభుత్వం వివాహ గుర్తింపు పత్రాన్ని జారీ చేసింది. ఇప్పటి వరకు యూఏఈలో జరిగే పెళ్లిళ్లన్నీ మతపరమైన సంస్థల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ ప్రభుత్వం తొలిసారిగా ఓ సివిల్ వివాహాన్ని కూడా గుర్తించింది. యూఏఈలో నివసించే మొత్తం జనాభాలో అధిక శాతం విదేశీయులే. ఈ నేపథ్యంలో తమది ఆధునిక సమాజంగా రూపొందించుకునే పనిలో తలమునకలుగా ఉన్న యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలకు నాంది పలికింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)