ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నడుమ వైద్య రంగంలోని ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. అక్కడి ఆస్పత్రుల్లోని నర్సులకు నెలకు రూ.8500 జీతానికి అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో అనేక దేశాల్లో ఆస్పత్రులు తల్లడిల్లిపోతున్నాయి. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో అంటూ కంగారు పడిపోతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బంది కరోనా కారణంగా అలసిపోయి ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఇంతకంటే మంచి జీతాలు లభించే వృత్తుల్లోకి మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు పరిస్థితి మెరుగుదిద్దే చర్యలకు పునుకుంటున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)