కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢల్లీి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢల్లీి వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడిరచారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయమా శాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరి బేసి ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బన్ షాప్‌లు మామూలుగానే తెరుచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలjే్యంతవరకు అన్ని పొలిటికల్, సామాజిక, మత పరమైన సమావేశాలపై ఢల్లీి ప్రభుత్వం నిషేధం విధించింది.