ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో వెనుక బడిన జిల్లా గా శ్రీకాకుళం జిల్లాకు పేరు. జిల్లాలో రాజాం నియోజకవర్గ పరిధిలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న పేద పిల్లలకు విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందివ్వాలని బాలవికాస కేంద్రాలు ప్రారంభించాము. ఇప్పుడు వాటిలో 10వ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నాం.
ఈ బాలవికాస కేంద్రాలను శిక్షణ పొందిన సేవా గుణం కలిగిన విద్యార్థులను ట్రైనర్లు గా మార్చి వారి ఆధ్వర్యంలో , పర్యవేక్షణ లో నడుపుతున్నాము. బాలవికాస కేంద్రాల 15 మంది ట్రైనెర్లకి 10000 రుపాయలు వారి చదువుకొరకు రాజా కసుకుర్తి సమకూర్చిన స్చొలర్షిప్స్ అందించటం జరిగింది. తానా అద్యక్షులు లావు అంజయ చౌదరి మరియు నగర ప్రముఖుల చెతులమీదగ స్చొలర్షిప్స్ అందించినారు.