రాజు, సుహాన జంటగా సురేష్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం బరి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్‌లుక్, టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా తెరకు పరిచయవుతున్న నాయకానాయికలు, దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఈ చిత్రం మంచి విజయాన్నందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో రాజు మాట్లాడుతూ మేమంతా ఎంతో కష్టపడి అందరికీ నచ్చేలా ఈ సినిమా తీశామన్నారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో కోడి పందేలు ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా పల్ల్లెటూర్లలోనే చిత్రీకరణ జరిపాం. అందుకే ఆ పేరు పెట్టాం అన్నారు. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. రేపల్లె, బాపట్ల, తెనాలి చుట్టుపక్కల చిత్రీకరణ జరిపాం. ఇందులో నాలుగు పాటలున్నాయి అన్నారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ దశలో ఉంది. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు నిర్మాతలు. మునికృష్ణ, గీతాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంగీతం: మహవీర్.
