రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా శేఖర్. ఇందులో రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించింది శివాని. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం అన్నారు. ఆత్మీయ రజన్, ముస్కాన్, అభివన్ గోమఠం, కన్నడ కిషోర్, భరణి శంకర్, రవి వర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : అనూప రూబెన్స్, రచన లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం : మల్లికార్జున నరగని. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు.