కార్మికుల కొరత తీర్చేందుకు విదేశీయుల అవసరం ఉందని జర్మనీ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జర్మనీ జనాభా పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడు 3 లక్షల మంది రిటైరవుతారని తెలిపారు. కార్మికుల కొరత తీరాలంటే విదేశీయులను దేశంలోకి ఆహ్వానించాలని తెలిపారు. 2030 చివరికల్లా దేశంలో పనిచేయగలిగే వారి సంఖ్య 50 లక్షల మేర పడిపోతుందని అంచనా వేశారు. యూరప్ అంతటా యువజనాభా తగ్గిపోతుండటంతో అనేక దేశాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యువజంటలు పిల్లల్ని కనాలంటూ పోప్ ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
