భారతదేశంలో మైనారిటీ ప్రజలను తీవ్రవాద శక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఇది ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో హిందుత్వవాదులు ముస్లింలపై విద్వేసం వెళ్లగక్కారన్న వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. అంతర్జాతీయ సమాజం భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చిందన్నారు. 20 కోట్ల భారతీయ ముస్లింలను ఊచకోత కోయాలన్న పిలునును బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తోందా అని ప్రశ్నించారు.
