నట్టి కుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం వర్మ. వీడు తేడా అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లో నట్టి క్రాంతి మీడియాతో మాట్లాడుతూ హీరోగా నా తొలి సినిమాకి మా నాన్నే దర్శకుడు కావడం నా అదృష్టం. టైటిల్ శర్మ కాబట్టి రామ్‌గోపాల్ వర్మ గురించి అనుకుంటారు. కానీ వర్మకు సంబంధమే లేదు. సినిమాలో హీరో పేరు వర్మ. సైకో లాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది కథ. థ్రిల్లర్ మూవీ. చివరి అరగంటపాటు భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చట్టం, టెంపర్ సినిమాల క్లైమాక్స్‌కు ప్రేక్షకులు ఎలా చప్పట్లు కొట్టారో వర్మకి కూడా అలా చప్పట్లు కొడతారనే నమ్మకం ఉంది. హీరోగానే కాదు, మంచి పాత్రలొస్తే బయటి చిత్రాల్లోనూ నటిస్తాను. అన్నీ కలిసి వస్తే దర్శకత్వం కూడా చేస్తాను అని అన్నారు. నట్టి లక్ష్మి, శ్రీధర్ పాత్తూరి సమర్పణలో నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది.