అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. నిత్యం లక్షలాది మంది కొవిడ్ బారినపడుతున్నారు. వేలాది మంది కరోనాతో మరణిస్తున్నారు. కరోనా బారినపడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు రూపొందిస్తూ అందర్నీ అప్రమత్తం చేసే సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 80కి పైగా దేశాలను లెవల్ 4 (వెరీ హై రిస్క్ జోన్) దేశాల జాబితాలో చేర్చిన సీడీసీ, మరో 22 దేశాలను అందులో చేర్చినట్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. లెవల్ 4 దేశాల జాబితాలోకి చేరిన దేశాలకు అస్సలు ప్రయాణించ్చొద్దంటూ ప్రజలను హెచ్చరించింది.
సీడీసీ లెవల్ 4 దేశాల జాబితాలో కొత్తగా చేరిన దేశాలను ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా, అరెజ్జింటీనా, టర్కీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, ఉరుగ్వే, పనామా తదితర దేశాలు ఉన్నాయి.