మెగాస్టార్ చిరంజీవితో త్రిష మళ్లీ జోడీకట్టనుందా? సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నది. మాస్, వినోదం, యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తున్నట్లు చెబుతుతున్నారు. త్రిష పేరుకంటే ముందు పలువురు నాయికల పేర్లు పరిశీలించారని, చివరికి త్రిషని ఎంపికచేసినట్టు తెలిసింది. చిత్ర బృందం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిరంజీవి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గతంలో స్టాలిన్ సినిమాలో చిరంజీవితో జోడి కట్టింది త్రిష. దాదాపు పదహారేళ్ల తర్వాత వెంకీ కుడుముల సినిమా ద్వారా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించనుండటం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)