మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి వెల్లడిరచారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని చిరు సూచించారు. త్వరలోనే మీ అందర్నీ కలుస్తాను అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌తో అభిమానులందరూ ఆందోళనకు గురవుతున్నారు. చిరు వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు. 2020 నవంబర్ 9వ తేదీన చిరంజీవి తొలిసారి కరోనా బారిన పడ్డారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)