భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కువైట్‌లో భారత రాయబారి సీబీ జార్జ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఎన్‌ఆర్‌ఐలకు చదివి విపించారు. ఈ వేడుకల్లో పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ ఈ వేడుకలు జరిగాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)