Namaste NRI

రష్యా అధ్యక్షుడిని హెచ్చరించిన జో బైడెన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. పుతిన్‌పై వ్యక్తిగత ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌ రక్షణ కోసం అమెరికా సైన్యాన్ని పంపే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల రక్షణ కోసం మాత్రం అదనపు బలగాలను పంపాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని పుతిన్‌కు తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడి చేస్తే కనుక ఆ తర్వాత భయంకరమైన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాని హెచ్చరికలు జారీ చేశారు. 

                        ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలో రష్యా తన సేవలను మోహరించడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌ విషయంలో ఏదో జరగబోతోందని ఉహించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ ఏ క్షణమైన 8,500 దళాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events