ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో అమెరికాలో సహా ఇండియాలో కూడా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారత్‌లో ప్రతి రోజు లక్షల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి అగ్రరాజ్యం అమెరికా కీలక సూచన చేసింది. అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు పునరాలోచించుకోవాలని కోరింది. కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్‌కు వెళ్లడం శ్రేయస్కరం కాదని పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)