నాని హీరోగా కొత్త సినిమా దసరా కు కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్, కిషోర్ తిరుమల, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. శ్రీకాంత్ ఓదెల తండ్రి చంద్రయ్య కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి నాని, కీర్తీ సురేష్ క్లాప్ ఇచ్చారు. కిశోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గర ఉన్న ఒక గ్రామంలో దసరా కథ సాగనుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో మాస్ యాక్షన్ పాత్రలో నాని కనిపించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)