భద్రతా కారణాలతో తమ దేశానికి చెందిన యాప్‌లను భారత్ నిషేధించడం పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై డ్రాగన్ స్పందించింది. చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందర్నీ భారత ప్రభుత్వం ఒకేలా చూస్తుందని, అందరి పట్లా పారదర్శకతతోనే వ్యవహరిస్తుందని తాము నమ్ముతున్నట్లు పేర్కొంది. అలాగే ఎవరిపైనా వివక్షత కూడా చూపదని తాము విశ్వసిస్తున్నట్లు చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత పరిపుష్టం కావడానికి భారత ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలకు పూనుకుంటుందని తాము భావిస్తున్నట్లు గావో ఫెంగ్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఇటీవల 54 యాప్‌లను ముఖ్యంగా చైనాకు చెందిన వాటిని నిషేధించినట్లు ఇక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)