తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహానీయుడు కేసీఆర్ అన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పద్మా రెడ్డి, రవి కుమార్ బట్టు, అమిత్ర్ ముళ్ళపూడి, మాధవ్ కటికనేని, సంపత్ చారి, మధుసూదన్ వర్మ, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మేడసాని, నాగరాజు గుర్రాల తదితరులు పాల్గొన్నారు.