Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..వినూత్న రీతిలో విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా నాయకుడు వినయ్‌ సన్నీ గౌడ్‌ ఆధ్వర్యంలో మెల్బ్‌ర్న్‌లో 15,000 ఫీట్‌ల నుండి స్కై డైవ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్‌, మెల్బ్‌ర్న్‌, కాన్బెర్రా, బ్రిస్బేన్‌, గోల్‌ కోస్ట్‌, బెండీగో, బల్లారాట్‌ నగరాలలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీర్గాయుష్షుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. తమ అభిమాన నాయకుడికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేసిన వినయ్‌ సన్నీ గౌడ్‌ను సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events