అంతర్జాతీయ ప్రయాణికులకు బహ్రెయిన్ తీపి కబురు చెప్పింది. కొవిడ్ నియమాల నుంచి భారీ ఉపశమనం కల్పిస్తున్నట్టు వెల్లడిరచింది. ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకున్న తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవసవరం లేదని వెల్లడిరచింది. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అయితే ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా బ్రహెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రయాణికులు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ వెల్లడిరచింది. ఆ ఆదేశాలు ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.