రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల కోసం తాము మూడు వందే మాతరం మిషన్ ఫైట్లను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో తాము ఉక్రెయిన్‌కు ఫైట్లను పంపుతున్నామని తెలిపింది. ఉక్రెయిన్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమాశ్రయం నుంచి ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. ఎయిరిండియా బుక్కింగ్ కార్యాలయాలు, వెబ్సైట్, కాల్ సెంటర్‌తో పాటు గుర్తింపు ట్రావెల్ యాజమాన్యాల దగ్గర టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)