విజయ్ శంకర్, అఘారెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఫోకస్. టి.సూర్యతేజ దర్శకుడు. ఈ చిత్రంలోని సీనియర్ నటి సుహాసిని లుక్‌పోస్టర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే చిత్ర టీజర్ చూశాను. చాలా బాగుంది. సినిమాలో చాలా మంచి పాత్రలున్నాయి. అందరూ ఈ చిత్రం చూసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించండి అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. జీవా, షియాజీషిండే, భరత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : వినోద్ యజమాన్య. ఛాయాగ్రహణం : జే. ప్రభాకర్ రెడ్డి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)