త్రిగుణ్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది. హారర్, కామెడీ కథతో తీస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హారర్ కామెడీతో సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది. ప్రేమకథను హారర్ కామెడీతో మేళమించి సినిమాను రూపొందించాం. సినిమా ఆద్యంతం నవ్విస్తూ సాగుతుంది అన్నారు దర్శకుడు. ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్‌కుమార్, శ్యామల, హేమంత్ తదితరులు నటిస్తున్నారు. చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఎంపీ ఆర్ట్స్ పతాకంపై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్, కెమెరా: వైయస్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుభాస్ డేవాబత్తిన. ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)