Namaste NRI

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర…

అంతా భయపడుతున్నట్లు జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు మొదలుపెట్టాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధ భేరీ మోగించారు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో  దేశమైనా జోక్యం చేసుకుంటే ఎన్నడూ చూడని పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. దీంతో రష్యా దళాలు  ఆ దేశంపై విరుచుకుపడ్డాయి. సైనిక, వైమానిక స్థావరాలు, ఆయుధ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌పై మెరియోపోల్‌, లుహాన్‌స్క్‌, షాష్ట్యా , క్రమెటెస్క్‌, సెన్‌కివ్కా, వీవ్‌, ఇవాన్‌ ఫ్రాంకా ఇన్‌స్క్‌ వంటి ప్రధాన ప్రాంతాలపై దాడులు చేశాయి.  తొలిరోజు రష్యా దాడుల్లో 137 మంది చనిపోయారని అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెల్‌న్‌స్కి ప్రకటించారు.  ఈ రోజు 132 మంది హీరోలను కోల్పోయం. అందులో పౌరులు, మిలటరీ సిబ్బంది ఉన్నారు అని జెల్‌న్‌స్కి తెలిపారు. మరో 316 మంది గాయపడ్డారని తెలిపారు. 

                కేవలం మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని రష్యా ప్రకటించింది. అయితే దానికి విరుద్ధంగా ప్రజావాసాలపై కూడా దాడి చేస్తున్నదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న పట్టణాలను కూడా సైన్యం లక్ష్యంగా చేసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ క్షమించరానిదన్నారు. రష్యాను సమర్థంగా ఎదురోవడానికి పూర్తిస్థాయిలో సైనికులను మోహరించాలని జెల్‌న్‌స్కీ ఆదేశించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events