ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరుపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తన గగనతలాన్ని బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. రష్యాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేసే చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. రష్యాకు చెందిన ఏరో ఫ్లోట్ విమానయాన సంస్థ కార్యకలాపాలపై బ్రిటన్ నిషేధం విధించింది. అయితే ఈ చర్యను రష్యా ప్రతీకారం తీర్చుకుంది. బ్రిటన్ విమానాలపై పుతిన్ ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. బ్రిటిష్ విమానాలు రష్యా విమానాశ్రయాల్లో దిగకుండా, అక్కడి గగనతలంలో తిరగకుండా ఆ దేశం నిషేదం విధించినట్లు బ్రిటన్ పౌర విమానయాన నియంత్రణ సంస్థ వెల్లడిరచింది. నేటి నుంచి ఈ నిషేధం అమలవుతుందని పేర్కొంది. యూకే ఏవియేషన్ అథారిటీ అనుకూల నిర్ణయాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)