ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ వెల్లడిరచింది. ఉక్రెయిన్‌పై మాస్కో అణిచివేతకు నిరసనగా ఈయూ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రష్యా ఎయిర్‌లైన్స్‌పై ఈయూ నిషేధం విధించింది. ఆ దేశం నుంచి హైటెక్ రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేసింది.