ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం పోరాటాన్ని ఆపి లొంగిపోతే చర్చకు సిద్ధమని తెలిపారు. మాస్కోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ ప్రజలు, ప్రజా సంస్థలపై తాము దాడులు చేయడం లేదని తెలిపారు. ఉక్రెయిన్‌ను నియో నాజీలు పరిపాలించాలని రష్యా కోరుకోవడం లేదన్నారు. పౌరుల రక్షణ కోసమే ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపట్టినట్లు తమ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారని తెలిపారు. అణచివేత నుంచి విముక్తి పొందితేనే ఉక్రేనియన్లు తమ భవిష్యత్తును స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)