టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం ఏజెంట్. కాగా చిత్రంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఏజెంట్ కోసం రంగంలోకి దిగారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు రూపొందిస్తున్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. పక్కంతం వంశీ కథని అందించారు. సాక్షి వైద్య కథానాకియ. కొత్త షెడ్యూల్ మొదలైంది. అందులో మమ్ముట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో భాగమయ్యారు అంటూ ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకుని మమ్మట్టి భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు : అజయ్ సుంకర, పతిదీపారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిశోర్ గరికిపాటి, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రగుల్ హెరియన్ ధరుమన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)