ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఇతర మంత్రివర్గానికి ప్రవాసం ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పొరుగునే ఉన్న పోలెండ్ దేశం నుంచి జెలెన్ స్కీ పరిపాలన కొనసాగించేందుకు వీలుగా అమెరికా పావులు కదుపుతోంది. యుద్దం ఇప్పట్లో ముగియడం కష్టమని భావిస్తున్నా అమెరికా ఉక్రెయిన్ సైనికుల్లోనూ ప్రజల్లో జెల్‌న్ స్కీ స్ఫూర్తిని నింపడం అత్యవసరం అని భావిస్తోంది. యుద్ధం సుదీర్ఘకాలం సాగవచ్చని ప్రవాసం తప్పేట్టు లేదని జెలెన్ స్కీ పాలన కొనసాగడం అనేది ఎంతో ముఖ్యమైన అంశమని తలపిస్తోంది. కీవ్‌ను రష్యా స్వాధీనం అవకాశాలు ఉండడంతో అమెరికా ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాను కీవ్‌ను వీడి వెళ్లనని ప్రజల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఇక్కడే ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవసరమైతే పోలాండ్ సరిహద్దుల్లో ఉన్న ఏదైనా సురక్షిత నగరంలోకి వెళ్లి విషయంపై అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడిరచారు. జెలెన్‌స్కీని, ఆయన మంత్రి వర్గాన్ని అవసరమైతే శరవేగంగా సురిక్షిత ప్రదేశాలకు తరలించేందుకు వీలుగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.