మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. డా.మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు పాత్ర చేస్తున్నారు విష్ణు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ భాగమైనట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. స్వాతి పాత్రలో పాయల్, రేణుక పాత్రలో సన్నీ నటిస్తున్నట్లు ప్రకటించింది. వారి పాత్రల గెటప్‌లను కార్టూన్ రూపంలో విడుదల చేశారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. వినోదానికి, యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె.నాయుడు. సంగీతం: అనూప్ రూబెన్స్, మూల కథ: జి.నాగేశ్వరరెడ్డి. అనూప్ రూబెన్‌స స్వరాలు సమకూరుస్తున్నారు.