లెజెండ్ దాదాసాహెబ్‌ఫాల్కే 2021 పురస్కారాల ప్రదానోత్స వేడుక ముంబయిలో అంగరంగ వైభవం జరిగింది. ఈ వేడుకలో దక్షిణాది చిత్రసీమకు చేసిన సేవలకు గాను సీనియర్ హీరో సుమన్‌కు లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రధానం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ ఈ అవార్డును సుమన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి 2021కి గానూ దక్షిణాది నుంచి నన్ను ఎంపిక చేశారు. దాదా మనవడి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.