ఇరాన్ నుంచి ఇరాక్ ఉత్తర ప్రాంత నగరమైన ఏర్బిల్‌లోని అమెరికా కాన్సలేట్ లక్ష్యంగా 12 క్షిపణులు దూసుకువచ్చాయి. పొరుగున ఉన్న ఇరాన్ నుంచే ఈ క్షిపణలు ప్రయోగించినట్టు అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్షిపణి దాడుల్లో ఆస్తి, ప్రాణనష్టంపై ఇరాక్, యూఎస్ అధికారులు పరస్పర విరుద్ధ ప్రటనలు చేశారు. కాన్సులేట్‌కు ఎలాంటి నష్టం జగరలేదని అమెరికా అధికారులు చెబుతుండగా. యూఎస్ కాన్సులెట్‌ను పలు క్షిపణులు తాకినట్టు ఇరాక్ అధికారులు తెలిపారు. పేలుళ్ల వల్ల ఆ టీవీ ఛానల్, కాన్సులేట్ భవనం కిటికీలు, ఇతర సామగ్రి మాత్రమే ధ్వంసమయ్యాయని వివరించారు. అక్కడే ఉండే ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎలాంటి ప్రభావం పడలేదని, ఒక్క విమానం కూడా రద్దు కాలేదని తెలిపారు.
అమెరికా కాన్సులేట్‌పై బాలిసిక్ మిసైల్స్‌ను ప్రయోగించినట్టు వారు తెలిపారు. కాగా ఇవి ఏ తరహా క్షిపణులనే విషయాన్ని యూఎస్ అధికారులు ధ్రువీకరించలేదు. మరోవైపు ఇరాక్‌లోని తమ కాన్సలేట్‌పై దాడిని అమెరికా ఖండిరచింది. ఇది ఇరాక్ సౌరభౌమత్వం, హింసను రెచ్చగొట్టేందుకు జరిపిన దాడిగా పేర్కొంది. దీనిపై ఇరాక్, కుర్దిష్ రీజినల్ గవర్నమెంట్ విచారణ జరుపుతాయని అధికారులు తెలిపారు.