సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ క్రమంలో తర్వాత సినిమా గురించి అప్‌డేట్ వచ్చింది. రెండో సినిమా కోసం భారీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు శ్రీకాంత్. అయితే రోషన్ హీరోగా తర్వాతి చిత్రం ఖరారైంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మించనున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించనున్నారు. మార్చి 13 రోషన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రోషన్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)