మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మిషన్ ఇంపాజియల్. తాప్సీ ప్రధాన పాత్రధారిణి. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి అరెస్ట్ ఆ తర్వాత బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలిగా తాప్సీ సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఆమె బృందంతో సహా ఈ మిషన్ నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, అప్పుడు తక్కువ సమయంలో ధనవంతునిగా మారి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏదీ లేదని భావించే తాప్సీ ఆ పిల్లల దైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఈ మిషన్ ఎలా పూర్తి చేస్తారనేది ఆస్తికర అంశం. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. నిరంన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం : మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన`దర్శకత్వం స్వరూప్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)