Namaste NRI

రష్మిక మందన్నకు బంపర్‌ ఆఫర్‌

కన్నడ సోయగం రష్మిక మందన్న దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతుంది. తెలుగులో భారీ చిత్రాల్లో కథానాయికగా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా రష్మిక మందన్న తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న నాయికగా ఎంపికైనట్లు సమాచారం. బోయపాటి చెప్పిన కథ రష్మికకు నచ్చడంతో ఆమె వెంటనే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.  ఇటీవలే పుష్పలో శ్రీవలి పాత్రతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పాపులర్‌ అయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events