ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తమ మద్దతు కొనసాగుతూనే వుంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బాంబు దాడుల నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవడానికి, ఆర్థిక ఆంక్షల నుంచి బయట పడడానికి తమకు చాతనైనంత సహాయం చేస్తూనే వుంటామన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు కూడా తమ సహాయం అందిస్తూనే వుంటామన్నారు. క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా మళ్లీ ఎప్పటిలాగే రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఇదో మహా తప్పిదమని వ్యాఖ్యానించారు. క్రిమియా స్వాధీనం తర్వాత కూడా రష్యాపై పశ్చిమ దేశాలు ఇంధన అవసరాల నిమిత్తం ఎక్కువగా ఆధారపడుతున్నాయని, ఇదే పెద్ద తప్పు అని జాన్సన్ ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై ఇన్ని బాంబు దాడులు చేస్తున్నా ప్రపంచం తనను ఏమీ అనలేదని పుతిన్‌కు తెలుసని, అందుకే ఇలా చేస్తున్నారని అన్నారు
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)