ఉక్రెయిన్ విషయంలో తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని చైనా పేర్కొంది. ఈ సంక్షోభంపై తాము సంపూర్ణ లక్ష్యంతో, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్‌పై మరింత దూకుడు ప్రదర్శించేలా రష్యాకు తాము సైనిక సామగ్రి, ఆయుధాలను సమకూర్చనున్నట్టు అమెరికా పనిగట్టుకున్ని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడిరది. అయితే రష్యా సైనిక చర్యను ఖండిరచడానికి, దాడిని యుద్ధంగా పిలవడానికి మాత్రం డ్రాగన్ దేశం అంగీకరించలేదు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ తమను లక్ష్యంగా చేసుకుని అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది అనైతికం, బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు.
ఉక్రెయిన్‌లో ఉద్రికత్తలను తగ్గించేందుకు అమెరికా ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. ఉక్రెయిన్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆర్థిక ఆంక్షలు విధించడం తగదని లిజియాన్ విమర్శించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు తమను తీవ్రంగా కలచివేస్తున్నాయని, శాంతి చర్చలను ప్రోత్సహించేందుకు చైనా కట్టుబడి ఉందని తెలిపారు. ఉద్రిక్తతలను తొలగించడం ద్వారా ఉక్రెయిన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తోడ్పడమే చైనా లక్ష్యమని, ఇందుకు చిత్తశుద్ధితో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ నిమిత్తం పంపిన మానవత సాయం పోలండ్ చేరిందని వెల్లడిరచారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివన్, చైనా విదేశాంగా విధానం సలహాదారు యాంగ్ బీచీలు రోమ్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనాలో యూరోపియన్ యూనియన్ రాబయారి నికోలస్ చాపుయిస్ కూడా ఉక్రెయిన్ విషయంలో చైనా తటస్థంగా ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు.