Namaste NRI

ఇజ్రాయెల్‌లో  కొత్త వేరియంట్‌ కలకలం

కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్‌ గురియోన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికులకు పీసీఆర్‌ పరీక్ష చేయగా కొత్త వేరియంట్‌ బయటపడినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్‌ వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2లను  కొత్త వేరియంట్‌ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక ఈ రెండు స్ట్రెయిన్‌లు కలిగిన కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్‌ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్‌ పాండమిక్‌ రెస్పాన్స్‌ చీఫ్‌ సల్కాన్‌ జర్కా పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ వ్యాప్తి, కేసులు గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events