భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కిషన్‌రెడ్డిని కోరారు. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ కోటపై శ్రద్ధ వహించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పర్యాటక శాఖ మంత్రి హోదాలో కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.