ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను భారత దేశం కొనడం ఆ ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని తాను భావించడం లేదన్నారు. అయితే భారత్ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ దేశాన్ని చరిత్రలో అపఖ్యాతిపాలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాసే చరిత్ర పుస్తకాల్లో ఏ వైపు ఉండాలనుకుంటున్నదీ భారత దేశం నిర్ణయించుకోవాలన్నారు. రష్యా నాయకత్వానికి మద్దతివ్వడమంటే దండయాత్రకు మద్దతివ్వడమేనన్నారు. దీనివల్ల విధ్వంసకర ప్రభావం ఉంటుందని తెలిపారు. తాము విధించిన, సిఫారసు చేసిన ఆంక్షలను పాటించాలని ప్రతి దేశాన్నీ కోరుతున్నామని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)