రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు రజనీకాంత్ పుల్‌స్టాప్ పెట్టేశాడు. భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. తనకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కల్ మండ్రం ఆఫీసు బేరర్‌లలో జరిగిన సమావేశంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు తలైవా ప్రకటించారు.
ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది చెప్పిన తలైవా అన్ని జిల్లాలకు చెందిన రజనీ మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్‌లతో భేటీ అయ్యారు. 70 ఏళ్ల రాజనీకాంత్ గత ఏడాది రాజకీయ పార్టీ ఆవిష్కరించే దిశగా అగుడులు వేశారు. కానీ 2020 డిసెంబర్‌లో ఆ ఆశలపై నీళ్లు పోశారు. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడం లేదని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడిరచారు. అయితే రాజకీయాల్లోకి ఎంటర్ కావడం లేదని మరోసారి స్పష్టం చేశారు.