పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ఎడ్లబండ్లు, గుర్రాలు, ఎడ్లబండ్లు, రిక్షాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజంన్ కుమార్ ఎడ్లబండిపై వచ్చి నిరసనకు దిగారు. పెరిగిన పెట్రో ధరలు, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్‌కు 70 రూపాయలుంటే, ఇప్పుడు 40 రూపాయలే ఉందని, అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయని నేతలు మండిపడ్డారు. మరోవైపు ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.